ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ దూకుడు
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:14 PM
ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో పలు కీలక విషయాలను ఈడీ అధికారులు గుర్తించారు.
అమరావతి, జులై 17: ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడుగా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణ కొనసాగుతోంది. సిగ్మా సంస్థకు కేటాయించిన కాంట్రాక్టు గడువు ముగిసిన తరువాత కూడా, నిబంధనలు విరుద్ధంగా దీర్ఘకాలికంగా పొడిగించుకుంటూ వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
మద్యం రవాణా కాంట్రాక్టులు దక్కించుకున్న సిగ్మా సంస్థ, ప్రసాద్ ట్రాన్స్ పోర్ట్ పేరుకు మాత్రమే ఉన్నాయని, వీటి ఆర్థిక లావాదేవీలన్ని రాజ్ కసి రెడ్డి, వాసు దేవరెడ్డి చేసినట్లు ఈడీ గుర్తించింది. మద్యం కేసు రవాణా చార్జీలు కింద రూ.196 వసూలు చేసి, వాటి రవాణా ఖర్చును రూ.35.57 పెంచారని ఈడీ విచారణలో తేలింది.
దీని ద్వారా వైసీపీ నేతలు రూ.195.33 కోట్లు లబ్ధిపొందారు. ఈ కుట్రకు రాజ్ కసి రెడ్డి రూపకల్పన చేయగా , నాటి బేవరెజస్ కార్పొరేషన్ ఎండీగా పదవిని అడ్డుపెట్టుకొని వాసు దేవ రెడ్డి కుట్ర అమలు చేసినట్లు ఈడీ గుర్తించింది. సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలు రికార్డ్స్‌లో మాత్రమే పేర్లు ఉన్నాయి. వాటి నిర్వహణ , కాంట్రాక్టు బాధ్యతలు నిర్వహించి రాజ్ కసి రెడ్డి, వాసు దేవా రెడ్డి , వైసీపీ నేతలు లబ్ది పొందినట్లు ఈడీ అధికారులు విచారణలో వెల్లడైంది.
ఇవి కూడా చదవండి...
గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..
మోదీ ఆశీస్సులు, నిర్మల ఆలోచనలతో పరుగులు పెడుతోన్న ఏపీ: పయ్యావుల కేశవ్