చైనా దగ్గర వందల సంఖ్యలో స్టెల్త్ యుద్ధ విమానాలు.. ఇండియా దగ్గర ఎన్ని ఉన్నాయంటే..
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:52 PM
రక్షణ రంగంలో భారత్‌ను ఆందోళనకు గురిచేసే ఓ సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. శత్రుదేశాల రాడార్ల కంటికి చిక్కకుండా దాడులు చేయగల స్టెల్త్ యుద్ధ విమానాల విషయంలో చైనా భారత్ కంటే వందల రెట్లు ముందంజలో ఉందని యూఎస్ డిఫెన్స్ జర్నల్ ‘ది వార్ జోన్’ వెల్లడించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో.. రక్షణ రంగంలో భారత్‌ను ఆందోళనకు గురిచేసే ఓ సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. శత్రుదేశాల రాడార్ల కంటికి చిక్కకుండా దాడులు చేయగల స్టెల్త్ యుద్ధ విమానాల విషయంలో చైనా భారత్ కంటే వందల రెట్లు ముందంజలో ఉందని యూఎస్ డిఫెన్స్ జర్నల్ ‘ది వార్ జోన్’ వెల్లడించింది.
వెటరన్ చైనా మిలటరీ వాచర్ ఆండ్రియాస్ రుప్రెచ్ట్ రాసిన ఆ నివేదిక ప్రకారం.. అత్యంత అధునాతనమైన యుద్ధ విమానాలు ‘J-20 మైటీ డ్రాగన్’ ఉత్పత్తిని చైనా ఊహించని స్థాయిలో పెంచేసింది. ప్రస్తుతం చైనా సైన్యం వద్ద ఏకంగా 500 ఆపరేషనల్ స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. చైనా యుద్ధ ప్రాతిపదికన వందల సంఖ్యలో స్టెల్త్ విమానాలను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వద్ద ఒక్క స్టెల్త్ యుద్ధ విమానం కూడా లేదు.
చైనా ఇప్పటికే ఈ J-20 రకం యుద్ధ విమానాలను భారత సరిహద్దులకు 150 కిలోమీటర్ల దూరంలో మోహరించింది. టిబెట్, సిక్కిం వైమానిక స్థావరాలలో J-20 రకం యుద్ధ విమానాలు మోహరించి ఉన్నాయి. ఆధునిక యుద్ధాలలో ఈ విమానాలు శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వలయాన్ని సులభంగా ఛేదించి మొదటి దెబ్బ కొట్టగలవు. భారతదేశం స్వదేశీ సాంకేతికతతో స్టెల్త్ ఫైటర్ ‘AMCA’ని అభివృద్ధి చేస్తోంది. అయితే, ఆ యుద్ధ విమానాలు పూర్తి స్థాయిలో సైన్యంలోకి రావడానికి మరో పదేళ్ల సమయం పడుతుంది.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ ఐఆర్‌ఎస్ అధికారి కుమార్తె హత్య కేసు.. 973 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు