Share News

న్యాయాధికారుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు

ABN , Publish Date - Oct 04 , 2026 | 04:23 AM

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ చేసి గెజిట్‌ ప్రచురించింది.

న్యాయాధికారుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు

గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ

అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ కోరుల్లో సేవలందిస్తున్న న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ (సర్వీస్‌ అండ్‌ కేడర్‌) నిబంధనలు-2026లోని రూల్‌ 17ను సవరించినట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఓ ప్రకటనలో తె లిపారు. వయసు పెంపుపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆమోదంతో ప్రభుత్వం ఈ నెల 1న ఆర్డినెన్స్‌ జారీచేసింది. గెజిట్‌ సైతం ప్రచురించింది. ఈ వయసు పెంపు ఈ ఏడాది మార్చి 31 నుంచి వర్తిస్తుందని మంత్రి పేర్కొన్నారు. గతంలో 2024 నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చేలా న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61 ఏళ్లకు పొడిగించినట్లు తెలిపారు. కాగా, న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని సుప్రీంకోర్టు ఇటీవల ఏడు రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఏకరూపు విధానం అమలు చేయడంపై ఆలోచన చేయాలని ఏపీతో సహా పలు రాష్ట్రాలకు సూచిస్తూ ఈ ఏడాది జూలై 22న, ఆగస్టు 5న ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆగస్టు 24న సమావేశమైన హైకోర్టు ఫుల్‌ కోర్టు కూడా రాష్ట్రంలో న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని తీర్మానం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనతో గవర్నర్‌ ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 04:23 AM