Share News

వెంట్రుకల పరిశ్రమపై విధాన నిర్ణయం తీసుకోవాలి

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:05 AM

మానవ వెంట్రుకల ప్రాసెసింగ్‌, తయారీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్‌) డిమాండ్‌ చేసింది.

వెంట్రుకల పరిశ్రమపై విధాన నిర్ణయం తీసుకోవాలి

  • కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రికి రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య వినతి

అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): మానవ వెంట్రుకల ప్రాసెసింగ్‌, తయారీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఏపీ ఛాంబర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు శనివారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు వినతిపత్రం అందజేశారు. ముడి వెంట్రుకల ప్రస్తుత ఎగుమతి, లైసెన్సింగ్‌ విధానాలను సమీక్షించాలని, వెంట్రుకల అక్రమ రవాణాను అరికట్టేందుకు మదింపు, పర్యవేక్షణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యంత్రాంగాలను మరింత పటిష్టం చేయాలని, దేశీయ తయారీదారులకు నాణ్యమైన ముడి సరుకు తగినంతగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 05:05 AM