Share News

పేద ముస్లింల అభ్యున్నతికి వక్ఫ్‌బోర్డు పెద్దపీట: మంత్రి ఫరూఖ్

ABN , Publish Date - May 02 , 2026 | 05:42 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం, వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ, పేదల అభ్యున్నతి కోసం పలు కీలక కార్యక్రమాలు చేపడుతోంది.

పేద ముస్లింల అభ్యున్నతికి వక్ఫ్‌బోర్డు పెద్దపీట: మంత్రి ఫరూఖ్
Andhra Pradesh Muslim Welfare

నెల్లూరు, మే 02: ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింల సంక్షేమం, వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ, పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. దేవాదాయ శాఖ కంటే ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో వక్ఫ్‌బోర్డుకు భారీగా ఆస్తులున్నాయి. కానీ.. గత ప్రభుత్వాల హయాంలో అవన్నీ నిర్వీర్యమయ్యాయి. అయితే.. ప్రస్తుత వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ముస్లింల అభివృద్ధికి విశేషమైన కృషి జరుగుతోంది.


ఈ సందర్భంగా మంత్రి ఎండీ ఫరూఖ్ మాట్లాడుతూ.. ‘పేద మహిళలు, యువత కోసం ప్రత్యేకంగా కంప్యూటర్ సెంటర్లు, టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ప్రారంభించాం. వీటి ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. నెల్లూరులో ముస్లిం పిల్లల కోసం ప్రత్యేకంగా కార్పొరేట్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం. డీఎస్సీ పరీక్షల్లో 11 శాతం మంది ముస్లిం యువత ఉద్యోగాలు సాధించారు. మంత్రి లోకేశ్ చొరవతో ఇంటర్మీడియట్ స్థాయిలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం వల్ల విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగింది. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 500 మంది పేద ముస్లిం విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వారి ఖర్చులను వక్ఫ్‌బోర్డే పూర్తిగా భరించనుంది. విజయవాడ నుంచి 335 మంది హజ్ యాత్రకు బయలుదేరారు. యాత్రికులకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ముస్లింలందరూ విజయవాడ నుంచే హజ్ యాత్రకు వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్‌కు మానసిక సమస్య ఉంది.. సీఎం సెటైర్లు

శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 02 , 2026 | 08:27 PM