గ్యాస్ ఉంది.. ఆందోళన వద్దు
ABN , Publish Date - Mar 15 , 2026 | 01:23 PM
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు జిల్లాలో తగినన్ని అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు.
- డీఎస్‌ఓ వంశీ కృష్ణారెడ్డి
పుట్టపర్తి(అనంతపురం): గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు జిల్లాలో తగినన్ని అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలోని 33 గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రస్తుతం 12 వేల డొమెస్టిక్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సాధారణంగా రోజుకు 6 వేల నుంచి 7 వేల వరకు సిలిండర్లను వినియోగదారులు బుక్ చేసుకుంటారని తెలిపారు. ప్రతి రోజు గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్ సరఫరా సక్రమంగా జరుగుతోందని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి రీఫిలింగ్‌కు అనుమతి ఉందని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తామని, వినియోగదారులు అనవసరంగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు, గోడౌన్ల వద్దకు వెళ్లవద్దని డీఎస్వో కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జగన్ దంపతులను విచారించాల్సిన అవసరం ఉంది: వైఎస్ సునీత
ఉల్లిగడ్డ పొట్టును పడేస్తున్నారా? ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..
Read Latest Telangana News and National News