NHAI: గిన్నీస్ రికార్డులు సొంతం చేసుకున్న ఎన్‌హెచ్ఏఐ
ABN , Publish Date - Jan 11 , 2026 | 09:43 PM
బెంగళూరు - కడప - విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో శరవేగంగా జరుగుతున్నాయి. దాంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) గిన్నీస్ రికార్డులను సొంతం చేసుకుంది.
అమరావతి, జనవరి 11: కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణం ఊపందుకొంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బెంగళూరు - కడప - విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) గిన్నీస్ రికార్డులను సొంతం చేసుకుంది. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో జనవరి 6వ తేదీ ఉదయం 10.07 గంటల నుంచి 11వ తేదీ ఉదయం వరకు నిరంతరాయంగా రహదారి నిర్మాణం చేపట్టింది.
దాంతో ఈ 6 రోజుల్లో 52 కిలోమీటర్ల (156 కిలోమీటర్ల లేన్ కి.మీ.) మేర రికార్డు స్థాయిలో రహదారి నిర్మాణం జరిగింది. వానవోలు - వంకరకుంట - ఓదులపల్లె సెక్షన్‌లోని ప్యాకేజ్- 2, 3 పనుల్లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేయడం, పేవింగ్ చేయడం ద్వారా రెండు గిన్నీస్ రికార్డులు సాధ్యమయ్యాయి. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా 57,500 మెట్రిక్ టన్నుల కాంక్రీటును రికార్డు స్థాయిలో నిర్మాణ సంస్థ అందజేసింది.
ఇక 70 టిప్పర్లు, 5 మిక్సింగ్ ప్లాంట్లు, 17 రోలర్లతో నిరంతరంగా రహదారి నిర్మాణం చేపట్టారు. పూర్తి క్వాలిటీతో రికార్డు స్థాయిలో నిర్మాణ పనులను ఈ కంపెనీ చేపట్టింది. రికార్డు స్థాయిలో రహదారుల నిర్మాణ పనులు చేపట్టిన నేషనల్ హైవే అథారిటీకి, రాష్ట్ర అధికారులకు, రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థలకు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలవరం-నల్లమల ప్రాజెక్టుతో సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్
For More AP News And Telugu News