Share News

పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Apr 30 , 2026 | 09:13 PM

పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం కిరికెరలో గురువారం జరిగింది.

పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

పుట్టపర్తి, ఏప్రిల్30: పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం కిరికెరలో గురువారం జరిగింది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన పరీక్షలకు విద్యార్థిని హంస శ్రీ (15) హాజరైంది. ఆ పరీక్షల ఫలితాలు గురువారం విడుదల చేశారు. ఈ పరీక్షల్లో తాను తప్పినట్లు హంస శ్రీ గుర్తించింది.


తల్లిదండ్రులు తనను తిడతారని ఆ విద్యార్థి భావించింది. దీంతో ఇంట్లోని గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి హంస శ్రీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏసీబీకి చిక్కిన బిల్లు కలెక్టర్.. సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ముగిసిన సోదాలు

అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావద్దు: విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 09:20 PM