ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. మరికాసేపట్లో తేలనున్న అభ్యుర్థుల భవితవ్యం
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:54 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగానూ రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థుల తరఫు ఏజెంట్లు చేరుకున్నారు.
అనంతపురం, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు (ఆదివారం) ఉదయం నుంచే పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పలు కేంద్రాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగానూ రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు వార్డుల వారీగా కౌంటింగ్ ఏజెంట్లను అధికారులు కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. మొదట వార్డు సభ్యుల ఓట్లను లెక్కించనుండగా.. అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించనున్నారు. అనంతపురం జిల్లాలో వాస్తవానికి గుంతకల్లు, శింగనమల నియోజకవర్గాల్లోని 9 మండలాల పరిధిలో 186 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే, 51 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 135 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు.
ఇక, శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లోని 12 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 169 పంచాయతీలకు గాను నాలుగు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 165 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఈరోజు సాయంత్రానికి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తెలియనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
పులివెందులలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి!
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత