అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 20 మందికి తీవ్రగాయాలు
ABN , Publish Date - Aug 09 , 2026 | 06:58 AM
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అనంతపురం, ఆగస్టు 09: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపంలోని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. దీంతో కల్వర్టుపై నుంచి ఆ రెండు వాహనాలు కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులతోపాటు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను పామిడిలోని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బస్సు- ఐషర్ వాహనాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లను స్థానికుల సహాయంతో పోలీసులు రక్షించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగంతోపాటు నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చొక్కాకు చిరుగులు.. కళ్లనిండా నీళ్లు
For More AP News And Telugu News