Share News

అల్లూరి జిల్లాలో పేలుడు ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

ABN , Publish Date - Oct 24 , 2026 | 09:49 PM

అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతి చెందిన ఏడుగురికి నష్టపరిహారం అందనుంది.

అల్లూరి జిల్లాలో పేలుడు ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

అల్లూరి జిల్లా, అక్టోబర్ 24: అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతి చెందిన ఏడుగురి కుటుంబాలకు నష్టపరిహారం అందనుంది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు సదరు కాంట్రాక్ట్ కంపెనీ అంగీకరించింది. అదనంగా నిబంధనల ప్రకారం బీమా సాయం అందేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.


కాగా ఈరోజు(శనివారం) ఉదయం పినకోట వద్ద మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వాహనంలో డీజిల్ నింపుతుండగా మంటలు అంటుకుని పేలుడు జరిగింది. మృతుల్లో కార్మికులతోపాటు ఓ ఉపాధ్యాయురాలు కూడా ఉన్నారు.


ఈ వార్తలూ చదవండి

అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

అల్లూరి జిల్లాలో పేలుడు ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా.. ఐదుగురి మృతి

Updated Date - Oct 24 , 2026 | 09:49 PM