అనంతపురం జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:51 AM
అనంతపురం జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ల్లాలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. కారులో వెళ్తున్న వ్యాపారి నాగరాజు(55), ఉపాధ్యాయుడు రాఘవేంద్ర గుప్త(45) అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యాపారి హర్షవర్ధన్, ఉపాధ్యాయుడు నరహరి తీవ్రంగా గాయపడ్డారు. వీరు నలుగురూ బెళుగుప్ప పట్టణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇంటీరియర్‌కు అవసరమైన ప్లైవుడ్ కొనుగోలు కోసం కారులో కర్ణాటకలోని కడూరుకు మంగళవారం వెళ్లారు. అక్కడ పని ముగించుకుని బుధవారం రాత్రి తిరుగుపయనమయ్యారు. బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి వద్దకు రాగానే కారు అతివేగం కారణంగా అదుపుతప్పింది. రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని, బస్సు షెల్టర్‌ను ఢీకొట్టి రెండు మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. బెళుగుప్ప పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
ప్రత్యేక టెట్‌లో మార్పులు చేయాలి
బెయిల్‌పై వచ్చి.. బెంబేలెత్తించి..