బస్సు ఢీకొని మహిళకు గాయాలు
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:09 AM
ఈనెల 24న రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడినట్టు ఎస్‌ఐ సల్మాన్ బేగ్ తెలిపారు.
రాజాం రూరల్, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): ఈనెల 24న రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడినట్టు ఎస్‌ఐ సల్మాన్ బేగ్ తెలిపారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం.. విశా ఖలోని కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన గుల్లాల రాజేశ్వరి తన సోదరి బేబీరాణితో కలిసి వ్యక్తిగత పనుల కోసం ఈనెల 24న రాజాం వచ్చారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు దిగుతుండగా సాయంత్రం కావడంతో విద్యార్థులతో రద్దీగా ఉండడంతో కొంతమంది విద్యార్థులు అదే బస్సు ఎక్కుతూ ఆమెను తోసివేశారు. కిందన పడి పోయిన రాజేశ్వరి లేస్తున్న సమయంలో మరో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఈమెను గమ నించకుండా, అజాగ్రత్తగా ఈమె కుడికాలుపై నుంచి బస్సును ఎక్కించాడు. దీం తో ఆమె కాలు విరిగింది. దీంతో రాజేశ్వరి రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. మెరుగైన చికిత్స కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. గురువారం రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సల్మాన్‌బేగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.