Share News

వీడని జ్ఞానేశ్వరి మిస్టరీ!..100 రోజులైనా దొరకని ఆచూకీ

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:14 AM

తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 100 రోజులు దాటినా లభించలేదు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన క్లూ లభించలేదు.

వీడని జ్ఞానేశ్వరి మిస్టరీ!..100 రోజులైనా దొరకని ఆచూకీ
Tuni girl missing

తుని రూరల్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై వంద రోజులు దాటినా మిస్టరీ వీడలేదు. ఇంతకాలం గడిచినా ఆ చిన్నారి ఎక్కడ ఉంది? ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. ఈ విషయంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ.. పాప ఆచూకీపై ఎలాంటి క్లూ రావట్లేదు.


ఈ ఏడాది జూన్‌ 6న కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌.అగ్రహారంలోని పామాయిల్‌ తోటలో ఆడుకుంటున్న జ్ఞానేశ్వరి అదృశ్యమైన విషయం తెలిసిందే. కిడ్నాప్‌, అడవి జంతువుల దాడి తదితర కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు. ఈ మిస్సింగ్‌ కేసు దర్యాప్తు వివరాలతో పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హెడ్‌ కానిస్టేబుల్‌ సాహసం
చంపేసి.. గోనెసంచిలో కుక్కేసి.. వివాహితను హత్యచేసిన ప్రియుడు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 06:14 AM