Mock Drills: మోగిన సైరన్..మాక్ డ్రిల్స్ షురూ

ABN, Publish Date - May 07 , 2025 | 04:49 PM

Mock Drills Telugu States: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు మరింత ముదిరాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలో సివిల్ మాక్ డ్రిల్స్ షురూ అయ్యాయి.

Mock Drills Telugu States: భారత పౌరులను అన్యాయంగా పొట్టనపెట్టుకున్న ఉగ్రమూకల అంతు చూడటమే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున భారత ఆర్మీ పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ కు ముందే భారత హోం శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసేందుకు రెండు రోజుల క్రితమే మాక్ డ్రిల్ చేపట్టాలని ఆదేశాలిచ్చింది. అందుకు అనుగుణంగా ఇవాళ 'ఆపరేషన్ అభ్యాస్' పేరిట దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీలోని విశాఖపట్నంలో సైరన్ మోగింది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై ప్రజలకు మాక్ డ్రిల్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు అధికారులు.

Updated at - May 07 , 2025 | 04:51 PM