హాట్సాఫ్ పోలీస్...

ABN, Publish Date - Mar 05 , 2025 | 04:46 PM

Jangaon police humanity: పోలీసులంటే కఠినంగా ఉండటమే కాదు.. అవసరమైనప్పుడు మానవత్వం చాటుకుంటారు అనే దానికి జనగామలో జరిగిన ఓ ఘటనే ఉదాహరణ. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి హాట్సాఫ్ పోలీస్ అనిపించుకున్నారు జనగామ పోలీసులు.

జనగామ, మార్చి 5: సాధారణంగా పోలీసులంటే కఠినమైన వారని అందరూ భావిస్తారు. వారు చేసే వృత్తి వారిని కాస్త కటువుగా మారుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఖాకీ చొక్క వెనక కూడా మానవత్వం ఉందని జనగామ పోలీసులు (Jangaon police) చాటుకున్నారు. జనగామలో ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థిని సోషల్ వెల్ఫేర్ స్కూల్ సెంటర్‌‌కు వెళ్లాల్సి ఉండగా.. తప్పుగా జనగామ మండల కేంద్రంలోని ప్రిస్టన్ పాఠశాలకు వచ్చింది. దీంతో కంగారు పడుతున్న విద్యార్థినిని గమనించిన ఇన్‌స్పెక్టర్ దామోదర్ రెడ్డి.. సీఐ, ఎస్సై సహకారంతో పోలీసు వాహనంలో విద్యార్థినిని సకాలంలో సరైన పరీక్షా కేంద్రం వద్దకు చేర్చారు.


ఇవి కూడా చదవండి..

Lokesh Speech at AP Assembly: తల్లికి వందనంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

Cyber criminals blackmail to MLA: ఏకంగా ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్.. బరితెగించిన సైబర్ నేరగాళ్లు

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 05 , 2025 | 04:46 PM