రేవంత్.. దేనికి చర్చకు రావాలి
ABN, Publish Date - Feb 22 , 2025 | 03:37 PM
Kishan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. హామీల అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదని విమర్శించారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 22: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ (CM Revanth Reddy) సవాల్‌ను స్వీకరిస్తున్నానని.. హామీల అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదని విమర్శించారు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదమన్నారు. దేనికి చర్చకు రావాలి సీఎం రేవంత్ స్పష్టం చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని.. బీజేపీని ఆదరించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గిందన్నారు.
ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుందని తెలిపారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని.. రిజర్వేషన్‌లను స్వాగతిస్తామని చెప్పారు. కానీ ముస్లింలను బీసీ జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తామన్నారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో అనేక సార్లు బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. జిల్లా అధ్యక్షుల నియామకాల ప్రక్రియ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్.. బకాయిలు ఎంత పేరుకుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు..
Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు
Read Latest Telangana News And Telugu News
Updated at - Feb 22 , 2025 | 03:37 PM