KPHB : మద్యం మత్తులో యువతుల హల్ చల్

ABN, Publish Date - Mar 07 , 2025 | 10:19 AM

మద్యం మత్తులో యువతులు హల్‌చల్ చేశారు. తప్పతాగి నడిరోడ్డుపైకి వచ్చి నానా బీభత్సం సృష్టించారు. కూకట్‌పల్లి మెట్రోస్టేషన్ సమీపంలో కారుతో వాహనదారులను ఢీకొట్టడమేకాకుండా వారిని బెదిరించారు.

మద్యం మత్తులో యువతులు హల్‌చల్ చేశారు. తప్పతాగి నడిరోడ్డుపైకి వచ్చి నానా బీభత్సం సృష్టించారు. కూకట్‌పల్లి మెట్రోస్టేషన్ సమీపంలో కారుతో వాహనదారులను ఢీకొట్టడమేకాకుండా వారిని బెదిరించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి యువతులకు డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అయితే ఈ టెస్ట్‌లో యువతులకు 212 పాయింట్ల రీడింగ్ వచ్చింది. కారులో బీరు టిన్నులను పోలీసులు గుర్తించారు. యువతులపై కేసు నమోదు చేశారు.


అర్థరాత్రి వరకు హైదరాబాద్ నగరంలో వారు తిరిగారు. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తూ కూకట్‌పల్లి మెట్రోస్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ద్విచక్రవాహనాలను డీకొట్టడం జరిగింది. బాధితుడి ఫిర్యాదు చేయడంతో యువతులు వెళ్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. పోలీసులతో యువతులు వాగ్వాదానికి దిగారు.

Updated at - Mar 07 , 2025 | 10:19 AM