మామునూరు ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్
ABN, Publish Date - Mar 01 , 2025 | 01:24 PM
Mamunuru airport credit war: మామునూరు ఎయిర్‌పోర్ట్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య క్రెడిట్ వార్ నెలకొంది. మా వల్లే ఎయిర్‌పోర్టు వచ్చిందంటే.. కాదు తమ వల్లే అంటూ ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు ఘర్షణకు దిగాయి.
వరంగల్, మార్చి 1: జిల్లాలోని మామునూరులో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కాంగ్రెస్ - బీజేపీ మధ్య మామునూరు ఎయిర్ పోర్ట్ (Mamunuru Airport) క్రెడిట్‌పై వివాదం తలెత్తింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. వరంగల్ మామూనూర్ ఎయిర్ పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోడీకి (PM Modi) పూలభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు వచ్చారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) వల్లనే ఎయిర్ పోర్ట్ రెడీ అవుతోందని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది.
మామునూరు ఎయిర్‌పోర్టు క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీపడుతున్నాయి. ఈ క్రమంలో మామునూరు ఎయిర్‌పోర్టుకు రెండు పార్టీల శ్రేణులు చేరుకున్నాయి. ప్రధాని మోడీ చొరవ వల్లే మామునూరు ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని బీజేపీ నేతలు సంబరాలు చేసుకునేందుకు మామునూరు ఎయిర్‌పోర్టు స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇరుపార్టీలకు చెందిన నేతలు ఒకేసారి ఎయిర్‌పోర్టు స్థలానికి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర నినాదాలు చేశాయి. అలాగే ఇరు పార్టీలకు చెందిన నేతలు ఘర్షణకు దిగారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి...
Tunnel Rescue Operations: టన్నెల్ వద్ద టెన్షన్ టెన్షన్.. కీలక దశకు రెస్క్యూ ఆపరేషన్
T.High Court: మల్టీప్లెక్స్‌లకు ఊరట... ఆ ఉత్తర్వులను సవరించిన హైకోర్టు
Read Latest Telangana News And Telugu News
Updated at - Mar 01 , 2025 | 01:28 PM