T.High Court: మల్టీప్లెక్స్‌లకు ఊరట... ఆ ఉత్తర్వులను సవరించిన హైకోర్టు
ABN , Publish Date - Mar 01 , 2025 | 12:53 PM
T.High Court: తెలంగాణలో మల్టీప్లెక్స్‌లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది హైకోర్టు. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది న్యాయస్థానం.
హైదరాబాద్, మార్చి 1: తెలంగాణలో (Telangana) మల్టీప్లెక్స్‌లకు హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. 16 సంవత్సరాల లోపు చిన్నారులను అన్ని షోలకు అనుమతించాలని ఆదేశించింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సవరించింది. అయితే ప్రీమియర్, బెన్‌ఫట్ స్పెషల్ షోలకు మాత్రం పిల్లల అనుమతికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల17కు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. కాగా.. జనవరి 21న 16 ఏళ్ల లోపు పిల్లలు మల్టీప్లెక్స్ థియేటర్‌కు వెళ్లే విషయంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

సమయాబావం లేకపోవడంతో పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు పలు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 సంవత్సరాల లోపు చిన్నారులు వెళ్లకూడదు అని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించాలని హైకోర్టు ధర్మాసనం కోరింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ యాజమాన్యం పోరాడుతోంది. బెనిఫిట్ షో, స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ తాజాగా 16 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించే విషయంలో ఉత్తర్వులను హైకోర్టు సవరణ చేసింది.
Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
16 ఏళ్ల చిన్నారులు థియేటర్‌లోకి వెళ్లే విషయంలో నిబంధనలు విధిస్తే.. సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వెళ్లే సమయంలో కుటుంబం మొత్తం వెళ్తుంటారు. ఈ క్రమంలో నిబంధనలు ఉంటే ఫ్యామిలీ వెళ్లే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఇతర వర్గాల అభిప్రాయాల సేకరించి కోర్టుకు సమర్పించడంతో న్యాయస్థానం జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. అలాగే స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు ఎట్టిపరిస్థితిల్లో పర్మిషన్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని కూడా హైకోర్టు ప్రస్తావిస్తూ తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి...
Vehicle Tracking: వాహనం ఆచూకీ ఇక పక్కా!
Tunnel Rescue Operations: టన్నెల్ వద్ద టెన్షన్ టెన్షన్.. కీలక దశకు రెస్క్యూ ఆపరేషన్
Read Latest Telangana News And Telugu News