తమిళ మీడియా సంస్థ వికటన్‌కు ఉపశమనం

ABN, Publish Date - Mar 07 , 2025 | 01:47 PM

అక్రమవలసదారులంటూ కాళ్ళకూ చేతులకూ గొలుసులు కట్టి, మొఖానికి మాస్కులు పెట్టి అమెరికా తన విమానాల్లో మన పౌరులను పంజాబ్‌లో దించేసినందుకు దేశం యావత్తూ బాధపడింది, అవమానపడింది.ఇంత అమానుషంగా, అగౌరవంగా వ్యవహరించడాన్ని ప్రశ్నించకపోతే ఎలా.. అని విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి.

తమిళనాడు: వందేళ్ళ చరిత్ర ఉన్న తమిళ మీడియా సంస్థ (Tamil media company) వికటన్‌ (Vikatan)కు మద్రాస్‌ హైకోర్టు (Madras High Court)లో తాత్కాలిక ఉపశమనం (Temporary Relief) కలిగింది. ఈ మ్యాగ్‌జైన్‌ వెబ్‌సైట్‌ను అన్‌బ్లాక్‌ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఏ కార్టూన్‌ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో సదరు సంస్థ వెబ్‌సైట్‌ను బ్లాక్‌చేసిందో, ఆ కార్టూన్‌ను తీసివేయాలన్న ముందస్తు షరతు ఇందులో ఉంది. షరతుకు అంగీకరించిన పక్షంలోనే, సదరు వెబ్‌సైట్‌ మళ్ళీ తెరమీద ప్రత్యక్షమవుతుందన్న ఈ ఆదేశాలు మధ్యంతరం కావచ్చును, అంతిమతీర్పు మిగిలే ఉండవచ్చు. కానీ, న్యాయస్థానం ఇలా అతిజాగ్రత్తగా వ్యవహరించడం మిగతా మీడియా సంస్థలకు ఉత్తేజాన్నిచ్చే అంశమైతే కాదు.

Read More News..:

విశ్రాంతి తీసుకుంటారా.. లేక సస్పెండ్ చేయించమంటారా..


అక్రమవలసదారులంటూ కాళ్ళకూ చేతులకూ గొలుసులు కట్టి, మొఖానికి మాస్కులు పెట్టి అమెరికా తన విమానాల్లో మన పౌరులను పంజాబ్‌లో దించేసినందుకు దేశం యావత్తూ బాధపడింది, అవమానపడింది.ఇంత అమానుషంగా, అగౌరవంగా వ్యవహరించడాన్ని ప్రశ్నించకపోతే ఎలా? అని విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని తప్పుబట్టాయి. ఆవేదనని అమెరికా సర్కారుకు తెలియచేశామని, అయితే, అక్రమార్కులను అలా గొలుసులు కట్టి పంపడం వాళ్ళ విధానమని మన ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఈ వివరణ మన పరువు మరింత దిగజార్చేట్టు ఉన్నదని మళ్ళీ విపక్షాలు తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ అమెరికా పర్యటన జరిగింది. భేటీలో ఈ అంశాన్ని మోదీ ప్రస్తావించకపోవడంపైన కూడా విమర్శలు వచ్చాయి. ట్రంప్‌ పక్కనే మోదీ గొలుసులతో కూర్చుని ఉన్న ఈ కార్టూన్‌ తమిళనాడు బీజేపీ అధినేత అన్నామలైకి ఆగ్రహం కలిగించింది. వికటన్‌ మ్యాగజైన్‌ డీఎంకేకు ప్రచారసాధనంలాగా తయారైందని, ప్రధానికి వ్యతిరేకంగా నిరాధారమైన కథనాలు ప్రచురిస్తోందని ఆయన ఓ ఫిర్యాదు సంధించారు. అది ఢిల్లీ చేరిన కొద్దిగంటల్లోనే సదరు సంస్థ వెబ్‌సైట్‌, దాని యాప్‌లు పనిచేయడం మానేశాయి. కార్టూన్‌ ఫిబ్రవరి 10న ప్రచురితమైతే, ఐదురోజుల అనంతరం కేంద్రప్రభుత్వం తన వెబ్‌సైట్‌ బ్లాక్‌ చేసిందనీ, ఫిబ్రవరి 25 వరకూ తనకు అధికారికంగా సమాచారమివ్వలేదని వికటన్‌ వాదన. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్ఎల్‌బీసీ..క్యాడవర్ డాగ్స్ ఆపరేషన్..

విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్

ఎమ్మెల్యే అరవింద బాబు వీరంగం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Mar 07 , 2025 | 01:47 PM