Kannada Actress Divya Suresh: కన్నడ నటి దివ్యపై హిట్ అండ్ రన్ కేసు

ABN, Publish Date - Oct 25 , 2025 | 09:05 PM

కన్నడ నటి దివ్య సురేశ్ పై హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది. ఈమె కన్నడ బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బైతరాయణపురలోని ఎంఎం రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.

బెంగళూరు, అక్టోబర్ 25: కన్నడ నటి దివ్య సురేశ్ పై హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది. ఈమె కన్నడ బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బైతరాయణపురలోని ఎంఎం రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన దివ్వ(Kannada Actress Divya Suresh) కారు.. ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్‎పై వెళ్తున్న ఉన్న అనూష, కిరణ్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. ఈ ఘటనలో పరారైన దివ్య సురేషపై బెంగళూరు పోలీసులు హిట్ అండ్ రన్‌ కేసు నమోదు చేశారు. అంతేకాక, ఆమె కారును కూడా పోలీసులు సీజ్‌ చేశారు. ఈ కేసులో దివ్యను విచారించేందుకు బెంగళూరు ట్రాఫిక్‌(Bengaluru traffic police పోలీసులు సిద్ధమవుతున్నారు


ఇవి కూడా చదవండి..

ఐదేళ్లూ సిద్ధరామయ్యే సీఎం.. యతీంద్ర స్పష్టత

బీఎంసీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు.. 150 సీట్లలో పోటీ యోచన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated at - Oct 25 , 2025 | 09:39 PM