న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
ABN, Publish Date - Dec 31 , 2025 | 12:11 PM
హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ(బుధవారం) రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారు జామున 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగున్నాయి. ఇక బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ రాత్రి 10 నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు పరిస్థితిని బట్టి క్లోజ్ చేస్తామని ఇన్‌చార్జ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని ప్రైవేటు వాహనాలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ(బుధవారం) రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారు జామున 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగున్నాయి. ఇక బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ రాత్రి 10 నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు పరిస్థితిని బట్టి క్లోజ్ చేస్తామని ఇన్‌చార్జ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని ప్రైవేటు వాహనాలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్ వంటి పలు పర్యాటక ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. 217 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తారని, ట్యాంక్‌బండ్, ఎన్‌టీఆర్ మార్గ్, నెక్లస్‌రోడ్ వంటి రద్దీ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ ఉన్నచోట ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, ర్యాష్ డ్రైవింగ్,ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
ఇవి కూడా చదివండి...
పెన్షన్ లబ్ధిదారులకు తీపి కబురు.. నేటి నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం..
Updated at - Dec 31 , 2025 | 12:12 PM