Maha Kumbh Mela 2025: భక్తి పేరుతో వ్యాపారం.. ప్రయాగరాజ్ కుంభమేళాలో ఏం జరుగుతుంది
ABN, Publish Date - Jan 02 , 2025 | 09:50 PM
Maha Kumbh Mela 2025:ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు ఖర్చు ఎంత..? భక్తిపేరుతో నెలన్నర రోజుల్లో ఎంత వ్యాపారం జరుగుతోంది..? . ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ ప్రయాగ రాజ్ మహా కుంభమేళా సమీపిస్తోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరగనుంది.
Maha Kumbh Mela 2025: ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు ఖర్చు ఎంత..? భక్తిపేరుతో నెలన్నర రోజుల్లో ఎంత వ్యాపారం జరుగుతోంది..? . ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ ప్రయాగ రాజ్ మహా కుంభమేళా సమీపిస్తోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. 45 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి 40 కోట్ల మంది వస్తారని అంచనా. 123 దేశాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.2013లో ప్రయాగరాజ్ కుంభమేళాకు 20 కోట్ల మంది వచ్చారు.2019 అర్థకుంభమేళాకు 25 కోట్ల మంది పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజల్లో భక్తి భావం పెరగడంతో ఆ సంఖ్య రెట్టింపు కానుంది. కుంభమేళాకు రావాలని యూపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.కుంభ మేళా నిర్వహణకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారుగా రూ, 7 వేల కోట్లను ఖర్చు చేస్తున్నాయి. వీఐపీలు, నాగ సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రయాగ రాజ్, గంగ, యమునా, సరస్వతి నదుల సంగామ ప్రదేశం కావడంతో మిగతా మూడు చోట్ల జరిగే కుంభమేళా కన్న ఇక్కడ స్నానాలు ఆచరించేందుకే భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. గత కుంభమేళాకు 22 ఫ్లోటింగ్ బ్రిడ్జీలు నిర్మించగా.. ఈ సారి 30 వంతెనలు నిర్మించారు. ప్రయాగరాజ్ చుట్టూ 483 కిలో మీటర్లమేర దారులు నిర్మించారు.1850 హెక్టార్లలో పార్కింగ్ వసతి కల్పించారు.2019లో జరిగిన అర్థకుంభమేళా కోసం 80 వేల టెంట్లు వేయగా ఈ సారి కుంభమేళకు 1.60 లక్షల టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. టెంట్ సిటీ పేరుతో భక్తులు ఉండేందుకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ టూరిజం శాఖతో పాటు ఐఆర్‌సిటిసీతో సహా 11 ప్రైవేట్ సంస్థలు టెంట్లు ఏర్పాటు చేశాయి. రోజుకు 1, 500 నుంచి లక్షా 10 వేల వరకు ఛార్జ్ చేసే విలాసవంతమైన టెంట్లు నిర్మించారు. డోమ్ సిటీ పేరుతో టెంట్లు ఏర్పాటు చేసేందుకు రూ. 51 కోట్లు ఖర్చు చేసింది ఈవో లైఫ్ స్పైస్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక హిల్ స్టేషన్‌లో ఉండే అనుభూతి కల్పించేందుకు 44 డోమ్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 176 కాటేజ్‌లు ఉన్నాయి. ఒక కాటేజ్ అద్దె రోజుకు రూ. 1. 10 వేలు వరకు ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నటి హేమకు బెంగుళూరు హైకోర్టులో ఊరట...
కొడిగుడ్డు కొనేటట్టు లేదు..తినేటట్టు లేదు..
ఏబీఎన్ చేతికి ఆదినారాయణపై దాడి దృశ్యాలు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 02 , 2025 | 10:17 PM