CM Chandrababu: ఆటో డ్రైవర్లకు చంద్రబాబు దసరా కానుక.. ఒక్కొక్కరికి 15 వేలు..

ABN, Publish Date - Sep 14 , 2025 | 12:42 PM

ఏపీలో ఆటో డ్రైవర్లకు దసరా కానుక అందించేందుకు రంగం సిద్ధమైంది. ఒక్కొక్కరికి ఏటా రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో, క్యాబ్ యజమానులకు, డ్రైవర్‌గా స్వయం ఉపాధి పొందుతున్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపుజేయనున్నట్లు రవాణా శాఖ విడుదల చేసిన జీవోలో పేర్కొంది.

ఏపీలో ఆటో డ్రైవర్లకు దసరా కానుక అందించేందుకు రంగం సిద్ధమైంది. ఒక్కొక్కరికి ఏటా రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో, క్యాబ్ యజమానులకు, డ్రైవర్‌గా స్వయం ఉపాధి పొందుతున్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపుజేయనున్నట్లు రవాణా శాఖ విడుదల చేసిన జీవోలో పేర్కొంది. ఈ నెల 13 నాటికి పాత లబ్ధిదారుల జాబితాను పరిగణించడంతో పాటూ కొత్త దరఖాస్తులకు 17 నుంచి 19వ తేదీ వరకూ అవకాశం కల్పించింది. క్షేత్ర పరిశీలన 22వ తేదీలోపు పూర్తి చేసి, 24న తుది జాబితాను సిద్ధం చేస్తారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి అక్టోబర్ 1న నేరుగా డబ్బులు జమ చేస్తారని ఉత్తర్వుల్లో తెలిపారు.

Updated at - Sep 14 , 2025 | 12:42 PM