Dy CM Pawan Kalyan: థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరున్నా చర్యలు తప్పవు..
ABN, Publish Date - May 27 , 2025 | 09:58 PM
థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమండ్రి ఇన్‌చార్జ్ సత్యనారాయణపై ఆరోపణలు రావడంతో జనసేన వేటు వేసింది.
థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమండ్రి ఇన్‌చార్జ్ సత్యనారాయణపై ఆరోపణలు రావడంతో జనసేన వేటు వేసింది. మరోవైపు థియేటర్ల నిర్వహణపై పవన్ చేసిన సూచనలను దిల్ రాజు స్వాగతించారు. పవన్ ఆదేశాలతో రాజమండ్రిలో థియేటర్లలో అధికారులు తనిఖీలు చేశారు.
హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలోకి వస్తున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం తీసుకోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా థియేటర్ల మూసివేత నిర్ణయం వెనుక జనసేన నాయకులు ఉన్నా కూడా వదిలిపెట్టొద్దని ఆయన ప్రకటన విడుదల చేశారు. అలాగే సగటు ప్రేక్షకుడు కుటుంబ సమేతంగా థియేటర్లకు రావాలంటే.. పాప్‌కార్న్, శీతలపానీయాలు, మంచి నీళ్ల బాటిళ్ల ధరలు కూడా భారీగా ఉంటున్నాయని.. అందుకే రావాలంటేనే భయపడుతున్నారని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - May 27 , 2025 | 09:58 PM