Ande Sri: అందెశ్రీ.. అసలు పేరు అందె ఎల్లన్న
ABN, Publish Date - Nov 10 , 2025 | 12:26 PM
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతతో సోమవారం గాంధీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్, నవంబరు10(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతతో ఇవాళ(సోమవారం) గాంధీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉదయం 7:25కి అందెశ్రీ మృతి చెందినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 1961 జూలై 18వ తేదీన సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లన్న. ఆయన మృతిపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనకు రూ.కోటి పురస్కారం అందజేసింది.
Updated at - Nov 10 , 2025 | 12:30 PM