Congress: అంధకారంలో కాంగ్రెస్..ఆందోళనలో నేతలు
ABN, Publish Date - Feb 21 , 2025 | 09:45 PM
కాంగ్రెస్ పార్టీని ఎవరూ బాగుచేయలేరా..? దేశవ్యాప్తంగా ఆ పార్టీకి భవిష్యత్తు లేదా..? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి. గ్రాండ్ ఏఐ పార్టీలో మార్పులు తీసుకు రాలేరా..? ఆ పార్టీ ఓడిపోతే ఎవరూ బాధ్యత తీసుకోరా..? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి జీరో స్కోర్ సాధించింది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీని ఎవరూ బాగుచేయలేరా..? దేశవ్యాప్తంగా ఆ పార్టీకి భవిష్యత్తు లేదా..? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి. గ్రాండ్ ఏఐ పార్టీలో మార్పులు తీసుకు రాలేరా..? ఆ పార్టీ ఓడిపోతే ఎవరూ బాధ్యత తీసుకోరా..? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి జీరో స్కోర్ సాధించింది కాంగ్రెస్ పార్టీ. కేజ్రీవాల్ ఓడిపోతే చాలనుకుందో ఏమో. కనీసం పొత్తులకు కూడా ప్రయత్నించలేదు. అంతకుముందు వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఢిల్లీలో ఒక్క సీటు సాధించకపోవడం మాములు విషయం కాదు. అసలు అర్బన్ ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారికి ప్రాధాన్యతను ఇవ్వాలని పార్టీ ఇన్‌చార్జ్‌లే గెలుపు ఓటములకు బాద్యత వహించాలని అన్నారు మల్లికార్జున ఖర్గే.
కాంగ్రెస్ పార్టీలో చేరేవారి విషయంలో తొందరపాటు వద్దని కాంగ్రెస్ భావజాలం ఉన్నవారిని మాత్రమే చేర్చుకోవాలని మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. తొందరపడి చేర్చుకున్న వారు కష్టకాలంలో పారిపోతారంటూ హితవు పలికారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడ్డ వ్యక్తులను ప్రోత్సాహించాలని సూచించారు. రాబోయే ఐదేళ్లు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాలని మల్లికార్జున ఖర్గే అన్నారు. బూత్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఆబాధ్యతలను ఇన్‌చార్జ్‌లు తీసుకోవాలని తెలిపారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 21 , 2025 | 09:46 PM