Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ వినూత్న ప్రయోగం

ABN, Publish Date - Aug 06 , 2025 | 09:24 PM

జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ వినూత్న ప్రయోగం చేపట్టారు. అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న స్పాట్‌ను గుర్తించి, అక్కడ వేగ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు..

జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ వినూత్న ప్రయోగం చేపట్టారు. అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న స్పాట్‌ను గుర్తించి, అక్కడ వేగ నియంత్రణ కోసం ప్రత్యేకంగా డయల్ 100 వాహనం, ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో కూడిన కటౌట్లను ఏర్పాటు చేశారు. దీంతో వాటిని చూసిన వాహనదారులు తమ వేగాన్ని నియంత్రించడంతో పాటూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నారు.


ప్రస్తుతం జిల్లాలోని గుడిహత్నూరు మండలం మేకల గండితో పాటూ నేరేడగొండ మండలం బంధం ఎక్స్ రోడ్డు వద్ద ఈ కటౌట్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనదారులు కాస్త నెమ్మదిగా వెళ్తున్నారు. గత రెండేళ్లలో ఎక్కువగా ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను గుర్తించి, వాటిని అరికట్టేందుకే కటౌట్లను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Aug 06 , 2025 | 09:24 PM