Hyderabad Fire Accident: 17కి చేరుకున్న మృతుల సంఖ్య.. ఫైర్ ఎగ్జిట్ లేకపోవటం వల్లే ప్రమాదం
ABN, Publish Date - May 18 , 2025 | 02:59 PM
పాతబస్తీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. పలువురు గాయాల బారిన పడ్డారు. భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్: పాతబస్తీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. పలువురు గాయాల బారిన పడ్డారు. భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది మృతిచెందారు. మలక్‌పేట యశోద, ఆపోలో డీఆర్డీవో ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఫైర్ ఎగ్జిట్ లేకపోవటం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Updated at - May 18 , 2025 | 03:01 PM