Share News

Kishan Reddy: భారత్‌ను విశ్వగురువుగా నిలబెడతాం..

ABN , Publish Date - Jan 18 , 2025 | 07:51 AM

భారత్‌ను విశ్వగురువుగా నిలపడమే ప్రధాని మోదీ(Prime Minister Modi) లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని.. రాజ్యాంగం విలువలను, అంబేడ్కర్‌ ఆశయాలను ప్రజలకు తెలియజేసేందుకే ‘సంవిధాన్‌ గౌరవ్‌ అభియాన్‌’ కార్యక్రమం అన్నారు.

Kishan Reddy: భారత్‌ను విశ్వగురువుగా నిలబెడతాం..

- కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

హైదరాబాద్: భారత్‌ను విశ్వగురువుగా నిలపడమే ప్రధాని మోదీ(Prime Minister Modi) లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని.. రాజ్యాంగం విలువలను, అంబేడ్కర్‌ ఆశయాలను ప్రజలకు తెలియజేసేందుకే ‘సంవిధాన్‌ గౌరవ్‌ అభియాన్‌’ కార్యక్రమం అన్నారు. ఈ నెల 26 నుంచి 2026 జనవరి 26 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. శుక్రవారం బర్కత్‌పుర(Barkatpura)లోని బీజేపీ నగర కార్యాలయంలో సంవిధాన్‌ గౌరవ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మెట్రో రైల్‌కు గ్రీన్‌ కారిడార్‌.. గుండె తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు


city4.jpg

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరణ చేశారని, కోర్టు తీర్పులను సైతం వ్యతిరేకించారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన కాంగ్రెస్‌ ఇప్పుడు నీతులు చెబుతుందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. గౌతమ్‌రావు, బంగారు శృతి, కొల్లి మాధవి, జి.ఆనంద్‌గౌడ్‌, శ్యాంసుందర్‌గౌడ్‌, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు

ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2025 | 07:52 AM