Share News

Hyderabad: మెట్రో రైల్‌కు గ్రీన్‌ కారిడార్‌.. గుండె తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 18 , 2025 | 07:30 AM

గుండె మార్పిడి చికిత్స కోసం గుండెను తరలించేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌(Hyderabad Metro Rail)కు శుక్రవారం రాత్రి గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకాపూల్‌(Lakdikapool)లోని గ్లెనెగిల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి వరకు 13 కిలోమీటర్ల మేర గుండెను మెట్రోలో 13 నిమిషాల్లో తరలించారు.

Hyderabad: మెట్రో రైల్‌కు గ్రీన్‌ కారిడార్‌.. గుండె తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు

హైదరాబాద్‌ సిటీ: గుండె మార్పిడి చికిత్స కోసం గుండెను తరలించేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌(Hyderabad Metro Rail)కు శుక్రవారం రాత్రి గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకాపూల్‌(Lakdikapool)లోని గ్లెనెగిల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి వరకు 13 కిలోమీటర్ల మేర గుండెను మెట్రోలో 13 నిమిషాల్లో తరలించారు. దాత నుంచి సేకరించిన గుండెను తీసుకుని రాత్రి 9.30 గంటలకు ఎల్‌బీనగర్‌లో మెట్రో ఎక్కిన వైద్యులు లక్డీకాపూల్‌లోని ఆస్పత్రికి 9.43కి చేరుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సైకిల్‌ ట్రాక్‌ నాణ్యతపై తనిఖీలు


కామినేని ఆస్పత్రి నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రోస్టేషన్‌(LB Nagar Metro Station)కు రోడ్డు మార్గంలో గుండె తరలించేందుకు నాలుగు నిమిషాలు పట్టినట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్గ నవీన్‌ (35)కు బ్రెయిన్‌డెడ్‌ కావడంతో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సేకరించారు. ఇందులో గుండెను కార్డియో మయోపతి సమస్యతో బాధపడుతున్న మహబూబ్‌నగర్‌(Mahabubnagar)కు చెందిన వ్యక్తి (35)కి అమర్చేందుకు గ్లోబల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్‌ అజయ్‌ జోషి ఆధ్వర్యంలో వైద్య బృందం గుండె శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. మరోవైపు కామినేని ఆస్పత్రి నుంచి గ్రీన్‌ చానెల్‌(Green Channel) ఏర్పాటుచేసి ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా ఊపిరితిత్తులను ప్రత్యేక అంబులెన్స్‌లో హైటెక్‌సిటీలోని యశోద ఆస్పత్రికి తరలించారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు

ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2025 | 07:30 AM