Share News

Hyderabad: సైకిల్‌ ట్రాక్‌ నాణ్యతపై తనిఖీలు

ABN , Publish Date - Jan 18 , 2025 | 07:02 AM

సిటీ: దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించిన సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌(Solar roof top cycle track) పనుల నాణ్యతపై త్వరలో తనిఖీలు చేయనున్నారు. ఇటీవల వట్టినాగులపల్లి ప్రాంతంలో ట్రాక్‌పై పగుళ్లు ఏర్పడిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Hyderabad: సైకిల్‌ ట్రాక్‌  నాణ్యతపై తనిఖీలు

- వాటర్‌బోర్డు పైపులైన్‌పైనే పగుళ్లు

హైదరాబాద్‌ సిటీ: దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించిన సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌(Solar roof top cycle track) పనుల నాణ్యతపై త్వరలో తనిఖీలు చేయనున్నారు. ఇటీవల వట్టినాగులపల్లి ప్రాంతంలో ట్రాక్‌పై పగుళ్లు ఏర్పడిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వాటర్‌బోర్డు పైపులైన్‌(Waterboard pipeline) ఏర్పాటు చేసిన తర్వాత సైకిల్‌ ట్రాక్‌ పనులు చేశారని, పైపులైన్‌ పైనే ట్రాక్‌కు పగుళ్లు వచ్చాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తల్లీకూతుళ్ల ఉసురు తీసిన టిప్పర్‌


పైపులైన్‌ 3500 ఎంఎం డయా కావడంతో ఆ పైనే వేసిన ట్రాక్‌ను పూర్తి స్థాయిలో రోడ్డు రోలార్‌తో తొక్కించలేదని, పైపులైన్‌ పగిలిపోతుందని నామమాత్రంగానే పనులు చేపట్టారని తెలిసింది. ఈ ప్రాంతంలో మినహా ఎక్కడా ట్రాక్‌పై పగుళ్లు రాలేదని అధికారులు అంటున్నారు. ట్రాక్‌ పనులపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో హెచ్‌ఎండీఏ(HMDA) ఉన్నతాధికారులు క్వాలిటీ కంట్రోల్‌ ఏజెన్సీతో తనిఖీలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాక్‌ పగుళ్లను నిర్మాణ సంస్థతోనే పూర్తి చేయించినట్లు అధికారులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు

ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2025 | 07:02 AM