Share News

Hyderabad: తల్లీకూతుళ్ల ఉసురు తీసిన టిప్పర్‌

ABN , Publish Date - Jan 18 , 2025 | 06:43 AM

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. ఫలక్‌నుమా కందికల్‌ గేట్‌(Falaknuma Kandikal Gate) ప్రాంతానికి చెందిన అజీమ్‌, రుక్సానా బేగం భార్యాభర్తలు. అజీమ్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

Hyderabad: తల్లీకూతుళ్ల ఉసురు తీసిన టిప్పర్‌

- చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతి

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. ఫలక్‌నుమా కందికల్‌ గేట్‌(Falaknuma Kandikal Gate) ప్రాంతానికి చెందిన అజీమ్‌, రుక్సానా బేగం భార్యాభర్తలు. అజీమ్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి బైక్‌పై భార్య రుక్సానా బేగం(29), కుమారుడు ముజమ్మిల్‌, కుమార్తె(3)తో కలిసి లంగర్‌హౌస్‌(Langarhouse) వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో కందికల్‌ గేట్‌ వస్తున్నారు. మైలార్‌దేవ్‌పల్లి ఉడంగడ్డ దాటిన తర్వాత శివాలయం వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ (టీఎస్‌ 06 యూబీ 1339) వారి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ వార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..


city1.2.jpg

తల్లీకూతుళ్లు టిప్పర్‌ చక్రాల కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అజీమ్‌, ముజమ్మిల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) మార్చురీకి తరలించారు. ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ అద్దాలను పగులగొట్టారు. పోలీసులు టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ చీరాల శివను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు

ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2025 | 06:43 AM