Rain Alert: భారీ వర్ష సూచన.. అలర్ట్ అయిన అధికారులు
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:07 PM
భారీ వర్షాల కారణంగా రోడ్లు, బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్లు జలమయం అవుతున్నాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తూ.. చర్యలు చేపడుతుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, అరెంజ్ అలర్టులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ప్రజలందరూ.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని పేర్కొంది. వర్షం పడే సమయంలో చెట్ల కింద కూడా ఉండకూడదని హెచ్చరిస్తుంది. ప్రయాణాలు మానుకోవాలని, లేని పక్షంలో వాయిదా వేసుకోవాలని తెలుపుతుంది.
భారీ వర్షాల కారణంగా రోడ్లు, బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్లు జలమయం అవుతున్నాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తూ.. చర్యలు చేపడుతుంది. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ.. అధికారులను ప్రజలతో సమన్వయం అయ్యేలా.. చూస్తుంది.
అయితే.. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా ప్రజలు వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నారు. పొలాల దగ్గరకు వెళ్లాల్సిన రైతుల కూడా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజల దృష్ట్యా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు కంట్రోల్ రూమ్ నెంబర్ 7981975495 కు ఫోన్ చేయాలని అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు