Share News

Hanumakonda: హనుమకొండలో రెచ్చిపోయిన అల్లరిమూక.. ఒకరి పరిస్థితి విషమం

ABN , Publish Date - Dec 31 , 2025 | 08:38 AM

హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. అల్లరిమూక రెచ్చిపోయింది. అర్థరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిపై దారుణంగా దాడి చేసింది.

Hanumakonda: హనుమకొండలో రెచ్చిపోయిన అల్లరిమూక.. ఒకరి పరిస్థితి విషమం

వరంగల్, డిసెంబర్ 31: అల్లరిమూక రెచ్చిపోయింది. అర్థరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిపై అల్లరిమూక ఆకారణంగా దాడి చేసింది. ఈ ఘటనలో బాధితుడు స్పృహ కోల్పోయాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. డిసెంబర్ 23వ తేదీ అర్థరాత్రి శ్యామ్ అనే వ్యక్తి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. అల్లరిమూక అతడిని అడ్డుకుని మూకుమ్మడిగా విచక్షణ రహితంగా దాడి చేసింది. ఈ దాడిలో అతడు స్పృహ కోల్పోయి.. కింద పడిపోయాడు.


అనంతరం అల్లరిమూక అక్కడి నుంచి పరారైంది. స్థానికులు వెంటనే స్పందించి.. అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు భార్య మీనా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా దాడి చేసిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులను పరిశీలించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు.. సంపతీ రాహుల్, వర్షిత్, పున్నం చందు, అన్వేష్, ప్రణయ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అరవింద్ పరారీలో ఉన్నాడు. అతడిని సైతం సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను శ్యామ్ కుటుంబ సభ్యులు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెన్షన్ లబ్ధిదారులకు తీపి కబురు.. నేటి నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

వైసీపీ నేతల దర్శనాలపై సోషల్‌ దుమారం

For More TG News And Telugu News

Updated Date - Dec 31 , 2025 | 08:43 AM