Share News

Crime News: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన డీటీసీకి 14 రోజుల రిమాండ్‌

ABN , Publish Date - Feb 09 , 2025 | 07:20 AM

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు అతనిని ఖమ్మం జైలుకు తరలించారు.

Crime News: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన డీటీసీకి 14 రోజుల రిమాండ్‌
Crime News..

వరంగల్: అక్రమాస్తుల కేసు (Illegal Assets case)లో అరెస్టు అయిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్‌ (డీటీసీ (DTC)) పుప్పాల శ్రీనివాస్‌ 9 Puppala Srinivas)కు అవినీతి నిరోధక శాఖ (ACB) ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్‌ (Remand) విధించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో హైదరాబాద్‌లోని శ్రీనివాస్‌ నివాసంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.4.04 కోట అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతినిని అదుపులోకి తీసుకుని వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఖమ్మం జైలుకు తరలించారు.

ఈ వార్త కూడా చదవండి..

భార్యను చంపింది గురుమూర్తి ఒక్కడే కాదు


పూర్తి వివరాలు..

ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని గుర్తించి అరెస్టు చేశారు, హనుమకొండ పలివేల్పుల రహదారిలోని దుర్గా కాలనీలో ఉంటున్న శ్రీనివాస్ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆదాయ పత్రాలు, దస్తావేజులు, స్థిర, చరాస్తులకు సంబంధించి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ స్వస్థలమైన జగిత్యాలతో పాటు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సుమారు 10 గంటలపాటు ఆయన్ను విచారించారు. ఇంట్లోని పలు దస్తావేజులు పరిశీలించిన అనంతరం హసన్పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తీసుకుని వచ్చి పలు అంశాలపై సమాచారాన్ని సేకరించారు. అనంతరం తిరిగి ఆయన్ను ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి,


ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రూ.4.04 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 15 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని.. మూడు గృహాల విలువ రూ. 2,79,32,740,15 ఎకరాల వ్యవసాయ భూమి రూ.14,04,768, బ్యాంకు బ్యాలెన్స్‌ రూ. 5,85,409, గృహోపకరణాలు రూ. 22, 85,700, 3 ఫోర్‌ వీలర్స్‌, ఒక బైక్‌ రూ. 43.80 లక్షలు, 1542.8 గ్రాముల గోల్డ్‌ రూ. 19,55, 650, 400 గ్రాముల వెండి రూ. 28వేలు, 23 విదేశీ మద్యం బాటిళ్ల విలువ రూ. 5.29 లక్షలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పుప్పాల శ్రీనివాసును అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు. కాగా గతేడాది ఫిబ్రవరిలో ఉమ్మడి వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అంతకుముందు హైదరాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో పనిచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌.. వైద్య రాజధాని

జీతం అడిగితే.. విషం తాగి చావమన్నారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 09 , 2025 | 07:20 AM