Telangana: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Feb 13 , 2025 | 08:29 PM
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అని.. విభజన అనంతరం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. గురువారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అని.. విభజన అనంతరం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. గురువారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడ్డుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆమె ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో స్పందించిన నిర్మలా సీతారామన్.. కాంగ్రెస్ ఎంపీల వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపట్లేదని స్పష్టం చేశారు.
తెలంగాణకు రెండు భారీ ప్రాజెక్టులు మంజూరు చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మెదక్ జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ నోడ్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన విషయం వాస్తవం అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. తెలంగాణ అప్పుల విషయంలో ఏ పార్టీని నిందించట్లేదన్నారామె. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపై వివక్ష చూపట్లేదన్నారు. బడ్జెట్‌లో ఏ ఒక్క రాష్ట్రానికి పెద్దపీట వేయట్లేదన్నారు. బడ్జెట్‌కు ముందు అన్ని రాష్ట్రాలను సంప్రదిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నామన్నారు.
తెలంగాణకు ఇచ్చింది ఇదీ..: నిర్మలా సీతారామన్
బీబీనగర్‌లో ఎయిమ్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2014 నుంచి తెలంగాణలో 2,605 కిలోమీటర్ల మేర హైవేల నిర్మాణం చేపట్టాం. భారత్‌మాల కింద 4 గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు నిర్మించాం. ఈ ఏడాది తెలంగాణలో రైల్వేకు రూ.5,337 కోట్లు కేటాయించాం. ఎర్రుపాలెం-నంబూరు, మల్కన్‌గిరి-పాండురంగాపురం మధ్య కొత్త రైల్వేలైన్లు చేపట్టాం. 2014 నుంచి 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేట్రాక్‌లు నిర్మించాం. తెలంగాణకు ఐదు వందేభారత్ రైళ్లు మంజూరు చేశాం’ అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read:
వల్లభనేని వంశీకి బిగుస్తున్న ఉచ్చు
అన్ బిల్డ్‌కి, అవుట్ స్టాండింగ్‌కి తేడా తెలుసా?
వైసీపీ నేతలకు దిమ్మతిరిగే షాక్..
For More Telangana News and Telugu News..