Share News

UG Admissions: 178 ఇంజనీరింగ్‌ కాలేజీలు 1,19,600 సీట్లు

ABN , Publish Date - Jun 28 , 2025 | 03:54 AM

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ, వ్యవసాయ కాలేజీల్లో యూజీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎప్‌సెట్‌-2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది.

UG Admissions: 178  ఇంజనీరింగ్‌  కాలేజీలు 1,19,600 సీట్లు

  • నేటి నుంచే ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌

  • 18న తొలివిడత సీట్ల కేటాయింపు

  • 25 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌

  • 57 రోజులు కొనసాగనున్న ప్రక్రియ

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ, వ్యవసాయ కాలేజీల్లో యూజీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎప్‌సెట్‌-2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. శనివారం (28వ తేదీ) నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతున్నాయి. గత ఏడాది ఫీజులే ఈ విద్యా సంవత్సరంలోనూ కొనసాగనున్నాయి. శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎప్‌సెట్‌ కన్వీనర్‌ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్ట్టారెడ్డి, వైస్‌ చైర్మన్లుపురుషోత్తం, ఎస్‌కే.మహమూద్‌, జేఎన్టీయూ అధికారులు పాల్గొని చర్చించారు. అనంతరం షెడ్యూల్‌ ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో 57 రోజుల పాటు కౌన్సెలింగ్‌ కొనసాగనుంది. ఆగస్టు 23న స్పాట్‌ అడ్మిషన్లతో ప్రక్రియ ముగుస్తుంది. జూలై రెండో వారంలో బీ-క్యాటగిరీ (యాజమాన్య కోటా) సీట్లకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.


కొత్తగా 3 ప్రభుత్వ వర్సిటీ కాలేజీలు..

గత ఏడాది మొత్తం 175 కాలేజీల్లో 1,18,880 సీట్లు ఉండగా.. ఈసారి మూడు యూనివర్సిటీ కాలేజీల్లో అదనంగా 720 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో హుస్నాబాద్‌లోని శాతవాహన వర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో 240 సీట్లు, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు వర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో 180, కొత్తగూడెంలోని ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో 300 సీట్లు ఉన్నాయి. దీనితో మొత్తం ఇంజనీరింగ్‌ కాలేజీల సంఖ్య 178కి, సీట్ల సంఖ్య 1,19,600కి చేరింది. మొత్తం 47 బ్రాంచిలలో ఈ సీట్లున్నాయి. గత ఏడాది మొత్తం 1,18,880 సీట్లకుగాను 1,06,880 సీట్లు భర్తీ కాగా, 12,000 సీట్లు మిగిలిపోయాయి.


కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా..

మొదటివిడతలో జూన్‌ 28 నుంచి జూలై 7: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ జూలై 1-7: విద్యార్థుల ధ్రువపత్రాల తనిఖీ, జూలై 6-10: ఆన్‌లైన్‌లో ఆప్షన్ల ఎంపిక, ఫ్రీజింగ్‌, జూలై 14-15: ఆప్షన్లలో మార్పులు, చేర్పులకు అవకాశం, జూలై 18: మొదటి విడత సీట్ల కేటాయింపు, జూలై 18-22: ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

  • రెండో విడతలో జూలై 25న రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌.. 26న ధ్రువపత్రాల తనిఖీ.. 26, 27 తేదీల్లో ఆప్షన్ల ఎంపిక.. 27న ఆప్షన్ల ఫ్రీజింగ్‌.. 30న సీట్ల కేటాయింపు ఉంటాయి. జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌.. జూలై 30 నుంచి ఆగస్టు 2 వరకు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలి.

  • చివరి విడతలో ఆగస్టు 5న రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌.. 6న ధ్రువపత్రాల తనిఖీ.. 6, 7 తేదీల్లో ఆప్షన్ల ఎంపిక.. 7న ఆప్షన్ల ఫ్రీజింగ్‌.. 10న సీట్ల కేటాయింపు ఉంటాయి. 10 నుంచి 12వ తేదీ వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌.. 11 నుంచి 13వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలి.

  • ఆగస్టు 18 నుంచి 23వ తేదీ వరకు ‘ఇంటర్నల్‌ స్లైడింగ్‌ (కళాశాలలో వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న సీట్లలోకి అదే కాలేజీలోని ఇతర బ్రాంచీల వారు మారే అవకాశం)’ ఉంటుంది.

  • ఆగస్టు 23న స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ

  • చేపడతారు.


ఈ వార్తలు కూడా చదవండి

Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..

Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?

Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్‌ నేతల రహస్య భేటీలు

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 28 , 2025 | 03:54 AM