Telangana: ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:47 PM
తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి(సోమవారం)తో ముగిసింది. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తుది విడత ఎలక్షన్ డిసెంబర్ 17న జరగనుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. ఇన్ని రోజులు గ్రామాల్లో హోరెత్తించిన మైకులు మూగబోయ్యాయి.
తెలంగాణ, డిసెంబర్ 15: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల(Telangana Panchayat Elections) ప్రచారం ముగిసింది. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తుది విడత ఎలక్షన్ డిసెంబర్ 17న జరగనుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. ఇన్ని రోజులు గ్రామాల్లో హోరెత్తించిన మైకులు మూగబోయ్యాయి. డిసెంబర్ 17న 182 మండలాలు 4157 గ్రామ పంచాయతీలు,28, 406 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. తుది విడతలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 53 లక్షల 6వేల 401 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 26 లక్షల 1861 పురుష ఓటర్లు, 27 లక్షల 4 వేల 394 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలానే146 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
తుది విడత పంచాయతీ ఎన్నికల కోసం 36 వేల 483 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇవాళ(సోమవారం) సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎల్లుండి(బుధవారం) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తుది విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్(Congress) దుమ్మురేపింది. మొత్తం 4,333 స్థానాల్లో సగాని కంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్ జిల్లాల మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. తొలి విడత మాదిరిగానే రెండో విడతలోనూ ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజారిటీ స్థానాలు వచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ బైక్ ర్యాలీ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..
సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించండి: సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ
For More AP News And Telugu News