YCP Bike Rally: వైసీపీ బైక్ ర్యాలీ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:26 PM
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అనంతపురంలో వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం, డిసెంబర్ 15: రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో వైసీపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ బైక్ ర్యాలీలో ఒక వర్గం వారు ముందుకు వెళ్లాంటే.. మరో వర్గం వారు ముందుకు వెళ్లాలంటూ ప్రయత్నించడంతో ఈ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని.. ఈ ఘర్షణలో గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల వారికి పోలీసులు సర్ది చెప్పారు. నగరంలోని వైసీపీ కార్యాలయం నుంచి క్లాక్ టవర్, సప్తగిరి సర్కిల్, పాతూరు మీదుగా బుక్కరాయసముద్రం వరకు ఈ ర్యాలీ సాగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అనంతపురంలో వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డితోపాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మెస్ ఇంచార్జ్‌పై చర్యలు తీసుకోవాలి.. రాజాసింగ్ డిమాండ్
సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించండి: సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ
For More AP News And Telugu News