Fog in Delhi: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100 విమానాలు రద్దు!
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:55 PM
ఢిల్లీలో పొగమంచు దట్టంగా కమ్మేసింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. విపరీతమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు, రైళ్లు రద్దయ్యాయి.
ఉత్తర భారతదేశాన్ని చలి గడ గడలాడిస్తుంది. ఢిల్లీ సహా పంజాబ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు(Temperatures) అనూహ్యంగా పడిపోవడంతో విపరీతమైన పొంగ మంచు కమ్ముకోవడంతో చలి తీవ్రత పెరిగిపోయింది. ఉదయం పూట హైవే పై దట్టంగా పొగమంచు (Fog) కమ్ముకోవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని. దీంతో వాహనదారులు (Motorists)ఎంతో ఇబ్బందిపడుతున్నారు. ఢిల్లీ్-ఎన్సీఆర్ (Delhi-NCR Area) ప్రాంతంలో పొగమంచి విపరీతంగా కమ్మేసింది. దీంతో విమాన, రైలు రాకపోకలపై ప్రభావం పడింది.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ (Delhi Airport) ఒకేసారి 100 కు పైగా విమానాలను రద్దు (100 Flights Cancelled) చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు 300 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు పొగమంచు కారణంగా సుమారు వంద రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వార్తలు వస్తు్న్నాయి. ఢిల్లీలో పొగమంచు పరిస్థిసి నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రయాణికులకు కీలక సూచన జారీ చేసింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానాల స్టేటస్ చెక్ చేసుకోవాలని తెలిపింది.
ఎయిర్‌లైన్ సిబ్బంది వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, ఢిల్లీ విమానాశ్రయ ఆధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపింది. భద్రతా ప్రోటోకాల్ కు అనుగుణంగా పనిచేస్తన్నాయని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. మరోవైపు ఇండిగో(Indigo), ఎయిర్ ఇండియా(Air India) వాతావరణ పరిస్థితిలు దృష్ట్యా పలు విమానాలు రద్దు కాగా, మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపింది. విమానాల స్టేటస్ గురించి తెలుసుకోవాలంటే వెబ్ సైట్స్ కి వెళ్లి చెక్ చేసుకోవాల్సిందిగా సూచించింది.
ఇవీ చదవండి:
ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు
నీ భర్తపై కేసు ఉందంటూ వృద్ధురాలికి కాల్.. చివరకు