Cyber Crime: నీ భర్తపై కేసు ఉందంటూ వృద్ధురాలికి కాల్.. చివరకు..
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:19 PM
సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్ల చేతుల్లో అనేక మంది మోసపోగా.. ఇప్పటికీ ఇంకా మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వృద్ధురాలని భయపెట్టి కోట్లలో రాబట్టారు కేటుగాళ్లు.
హైదరాబాద్, డిసెంబర్ 15: సైబర్ నేరగాళ్లు మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులకు ఫోన్ చేసి మాయమాటలతో లేదా బెదిరింపులకు గురిచేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పలువురు ఉద్యోగాల పేరుతో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా కేసులు ఉన్నాయంటూ , డబ్బులు కట్టకపోతే జైలుకు వెళతారంటూ ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు కేటుగాళ్లు. వీళ్ల మోసాలకు అనేక మంది పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్న పరిస్థితి. యువతతో పాటు వృద్ధులనూ టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ వృద్ధురాలిని కేసు పేరుతో భయపెట్టి కోట్లలో సైబర్ నేరగాళ్లు దోచుకున్న ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే...
మానవ అక్రమ రవాణా పేరుతో దాదాపు రూ.2 కోట్ల మేర కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. 75ఏళ్ల ఓ వృద్ధురాలు ఈ కేటుగాళ్ల మోసానికి బలయ్యారు. మీ భర్తపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేస్ నమోదైందని ఆమెను సైబర్ నేరగాళ్లు నమ్మించారు. టెలికామ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఆమె భర్తను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.2 కోట్లు పంపాలని డిమాండ్ చేశారు. మొదటి సైబర్ నేరగాళ్ల మాటలను నమ్మలేదా వృద్ధురాలు.
కానీ.. తన భర్తకు సంబంధించిన ఆధార్, వీసా డీటెయిల్స్ చెప్పడంతో నమ్మాల్సి వచ్చింది. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో దాదాపు రూ.2 కోట్ల నగదును నేరగాళ్లకు పంపారామె. అయితే.. చివరకు తాను మోసపోయానని గ్రహించిన ఆమె.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తాను మోసపోయిన విధానం గురించి క్లుప్తంగా పోలీసులకు తెలిపారామె. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు
నాలుగవ రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ.. ఆ సమాచారంపైనే సిట్ ఫోకస్
Read Latest Telangana News And Telugu News