Duvvada Madhuri Srinivas: బర్త్ డే పార్టీ.. దువ్వాడ మాధురి శ్రీనివాస్ బంధువుకు నోటీసులు
ABN , Publish Date - Dec 15 , 2025 | 10:49 AM
వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి పాల్గొన్న బర్త్ డే పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బర్త్ డే పార్టీపై మొయినాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి మాధురి బంధువు పార్థసారధికి నోటీసు ఇచ్చారు
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి (Duvvada Madhuri Srinivas) తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన బర్త్ డే పార్టీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ విషయం రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులకు తెలియడంతో దాడి చేసి 10 విదేశీ మద్యం బాటిళ్లు, ఐదు హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ పార్టీకి హాజరైన దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు మాధురి, ఆమె బంధువు అమలాపురం ప్రాంతానికి చెందిన పార్థసారథిలను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ పార్టీలో వీరితో పాటు మరో 26 మంది పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ బర్త్ డే పార్టీపై మొయినాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి మాధురి బంధువు పార్థసారధికి నోటీసు ఇచ్చారు పోలీసులు. కోర్ట్ కేస్ విచారణ ఉన్నప్పుడు రావాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. అయితే ఈ ఈవెంట్ నిర్వహించింది పార్థసారధి కావడంతో ఆయనపై మాత్రమే కేస్ నమోదు చేశారు. అనుమతి లేకుండా పార్టీలో విదేశీ, మద్యం హుక్కా వాడారని నోటీసులో మొయినాబాద్ పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. అమాంతం గాల్లోకి ఎగిరి
హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు
Read Latest Telangana News And Telugu News