Viral wedding video: ఇది కల్యాణ మండపమా.. స్పా సెంటర్‌నా.. అతిథులకు ఎలాంటి మర్యాదలంటే..
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:40 PM
వివాహ వేడుక చాలా వైభవంగా జరగాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అవసరమైతే అప్పులు చేసి కూడా ఘనమైన ఏర్పాట్లు చేస్తుంటారు. పెళ్లి కోసం డబ్బులను మంచినీళ్లలా ఖర్చుపెడుతుంటారు.
పెళ్లి (Marriage) అనేది మరపురాని అనుభూతిగా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వివాహ వేడుక చాలా వైభవంగా జరగాలనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అవసరమైతే అప్పులు చేసి కూడా ఘనమైన ఏర్పాట్లు చేస్తుంటారు. పెళ్లి కోసం డబ్బులను మంచినీళ్లలా ఖర్చుపెడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో (Wedding Video)ను చూస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే పెళ్లికి వచ్చిన అతిథులకు రాచ మర్యాదలు చేశారు.
pearltheorganisers అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే కల్యాణ మండపంలో అతిథుల కోసం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశారు. పెళ్లిలో ఏర్పాట్లు అంటే విందు భోజనాల గురించే మాట్లాడుకుంటాం. అయితే ఈ పెళ్లిలో అతిథుల కోసం మసాజ్‌లు ఏర్పాటు చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులకు అమ్మాయిల చేత ఫుట్ మసాజ్‌లు చేయించారు. అతిథులు చక్కగా విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు (wedding or spa centre).
పెళ్లి అంటే కేవలం విందు భోజనం మాత్రమే కాదు.. అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (shocking wedding scenes). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 14 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇది కొంచెం అతిగా ఉందని ఒకరు కామెంట్ చేశారు. అలాంటి పెళ్లికి వెళ్లాలంటే అదృష్టం ఉండాలని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అతిథులకు అదిరిపోయే విందు.. ఈ మర్యాదలు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే..
మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ నది ఒడ్డున కుక్క ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..