Secunderabad: రైల్వే ప్రయాణికులకో గుడ్‌న్యూస్.. అదేంటో తెలిస్తే..
ABN , Publish Date - Sep 06 , 2025 | 07:21 AM
రానున్న దసరా, దీపావళి, ఛట్‌ల పండగల దృష్ట్యా ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రద్దీ నెలకొన్న దృష్ట్యా కొన్ని రైళ్లను సనత్‌నగర్-అమ్ముగూడ-మౌలాలీ-చర్లపల్లి మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- పండగల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు
హైదరాబాద్: రానున్న దసరా, దీపావళి, ఛట్‌ల పండగల(Dussehra, Diwali, and Chhath festivals) దృష్ట్యా ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రద్దీ నెలకొన్న దృష్ట్యా కొన్ని రైళ్లను సనత్‌నగర్-అమ్ముగూడ-మౌలాలీ-చర్లపల్లి మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంకా సికింద్రాబాద్(Secunderabad) ప్లాట్ ఫాం 10 వైపు 200 కార్ల పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అదనపు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని, టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా అనే సదుపాయాలు వినియోగంలోకి రాబోతున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత
Read Latest Telangana News and National News