Trains: మారిన ప్యాసింజర్ రైళ్ల నంబర్లు
ABN , Publish Date - Aug 22 , 2025 | 10:06 AM
దక్షిణమధ్యరైల్వే పరిధిలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న ప్యాసింజర్ రైళ్ల నంబర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే, కొన్ని ప్యాసింజర్ రైళ్లకు ప్రస్తుతం ఉన్న ఐసీఎ్‌ఫ(ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌ల స్థానంలో డెమో, మెమూ కోచ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్ సిటీ: దక్షిణమధ్యరైల్వే(South Central Railway) పరిధిలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న ప్యాసింజర్ రైళ్ల నంబర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే, కొన్ని ప్యాసింజర్ రైళ్లకు ప్రస్తుతం ఉన్న ఐసీఎ్‌ఫ(ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌ల స్థానంలో డెమో, మెమూ కోచ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 57601/57602 నంబర్లతో కాచిగూడ-వాడి మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లకు ఇకపై 67785/67786 నంబర్లను కేటాయించారు. ఈ మార్పులు ఈనెల 25నుంచి అమలుకానున్నాయి.

అలాగే, 77647/77648 నంబర్లతో కాచిగూడ- రాయచూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లకు 67787/67788 నంబర్లను కేటాయించారు. 26వ తేదీనుంచి ఈ మార్పు జరగనుంది. మరోవైపు మిర్యాలగూడ- కాచిగూడ ప్యాసింజర్(Miryalaguda-Kacheguda Passenger) (77648)రైలు గతంలో ఉదయం 10గంటలకు చేరుకునేది. తాజాగా ఆ సమయాన్ని 10.20గంటలకు పొడిగించారు. కాచిగూడ-వాడి ప్యాసింజర్(Kacheguda-Wadi Passenger)కు ఐసీఎఫ్ రేక్ బదులుగా మెమూ రేక్‌ను, కాచిగూడ-రాయచూర్ మధ్య తిరిగే ప్యాసింజర్‌కు డెమో రేక్ బదులుగా మెమూ రేక్‌ను వినియోగించాలని దక్షిణమధ్యరైల్వే నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..
Read Latest Telangana News and National News