Share News

Rail Passengers Alert: పండగ వేళ ప్రయాణికులకు అలర్ట్.. రైళ్లోలో వాటిని తీసుకెళ్తే రూ.1000 జరిమానా!

ABN , Publish Date - Oct 14 , 2025 | 03:24 PM

పండగలు వేళల్లో అయితే నెల ముందు నుంచి రిజర్వేషన్లు ఫుల్ అవుతాయి. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు ప్రయాణిలకు కీలక సూచనలు చేస్తుంటారు. తాజాగా ఓ సౌత్ ఇండియ సెంట్రల్ రైల్వే..ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది.

 Rail Passengers Alert: పండగ వేళ ప్రయాణికులకు అలర్ట్.. రైళ్లోలో వాటిని తీసుకెళ్తే రూ.1000 జరిమానా!
South Central Railway

చాలామంది రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బస్సు జర్నీతో పోలిస్తే ట్రైన్ లో ప్రయాణం బాగుంటుందని ఎక్కుమంది అభిప్రాయ పడుతుంటారు. అందుకే సుదూర ప్రాంతాలకు వెళ్లే..సామాన్యులు రైళ్లనే మొదటి ఛాయిస్ గా పెట్టుకుంటారు. ఇక పండగలు వేళల్లో అయితే నెల ముందు నుంచి రిజర్వేషన్లు ఫుల్ అవుతాయి. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు ప్రయాణిలకు కీలక సూచనలు చేస్తుంటారు. తాజాగా సౌత్ ఇండియ సెంట్రల్ రైల్వే..ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది. వాటిని అతిక్రమిస్తే..రూ.1000 జరిమానా విధిస్తామని వెల్లడించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


కొన్నిరోజుల్లో దీపావళి పండుగ(Railway Travel Tips Diwali) రానుంది. ఈ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైళ్లలో జర్నీ చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. ట్రైన్స్ లో జర్నీ చేసే టైమ్ లో ప్రయాణికుల భద్రతకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే, అగ్నిప్రమాదానికి దారి తీసే వస్తువులు ,పేలుడు పదార్దాలను(Prohibited Items in Trains) తీసుకెళ్లొద్దని హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత వస్తువును రైళ్లల్లో తీసుకెళ్తే రైల్వే యాక్ట్-1989లోని సెక్షన్‌ 164, 165 ప్రకారం రూ.1000 వరకు జరిమానా లేదా 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని, కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారని రైల్వే అధికారులు(SCR Issues Safety Advisory) తెలిపారు


కాబట్టి అధికారుల సూచనలు గుర్తుంచుకుని రైళ్లలో, రైల్వే ప్రాంగణంలో బాణసంచా, ఇతర పేలుడు, గ్యాస్ సిలిండర్ వంటి ప్రమాదకరమైన వాటిని(Prohibited Items in Trains) లగేజీ, పార్శిల్‌గా తీసుకెళ్లవద్దని ప్రయాణికులకు రైల్వేశాఖ (South Central Railway )హెచ్చరిస్తోంది. అలానే రైళ్లలో లేదా స్టేషన్లలో పేలుడు వస్తువులు లేదా ఏదైనా ఇతర అనుమానాస్పద, ప్రమాదకరమైన లగేజీ , స్వభావం గల పదార్థాలను గమనించినట్లయితే వెంటనే సమీపంలోని రైల్వే సిబ్బందికి, పోలీసులకు తెలియజేయవచ్చు. అలానే భద్రతా హెల్ప్‌లైన్ -139 కాల్‌ చేయగలరని దక్షిణ మధ్య రైల్వే అధికారులు(South Central Railway) ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం

ప్రధాని మద్దతుతోనే సాధ్యం.. గూగుల్‌తో ఒప్పందంపై సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 04:02 PM