RV Karnan: ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వండి..
ABN , Publish Date - Oct 30 , 2025 | 08:59 AM
పోలింగ్ రోజు కేంద్రాల్లో జరిగే విషయాలను పరిశీలించి సాధారణ పరిశీలకులకు నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సూక్ష్మ పరిశీలకులకు సూచించారు.
పోలింగ్ కేంద్రాలపై సూక్ష్మ పరిశీలకులకు కర్ణన్ సూచన
హైదరాబాద్ సిటీ: పోలింగ్ రోజు కేంద్రాల్లో జరిగే విషయాలను పరిశీలించి సాధారణ పరిశీలకులకు నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(District Election Officer and GHMC Commissioner RV Karnan) సూక్ష్మ పరిశీలకులకు సూచించారు. పోలింగ్ పరిశీలనలో మీరు కీలకమని, ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ప్రతీ అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఎన్నికల విధులు- బాధ్యతలపై ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తించే 120 మందికి పైగా సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల సాధారణ పరిశీలకులు రంజిత్‌కుమార్‌తో కలిసి కర్ణన్ శిక్షణ ఇచ్చారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సూక్ష్మ పరిశీలకులు సాధారణ పరిశీలకుల నియంత్రణలో పనిచేస్తారని, పోలింగ్ కేంద్రాల్లో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. మాక్ పోలింగ్ నిర్వహణ, అనంతరం పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు.
ఈవీఎంల రెండో దఫా ర్యాండమైజేషన్..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం(Kotla Vijayabhaskar Reddy Stadium)లో రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులు రంజిత్‌కుమార్,
పోలీస్ అబ్జర్వర్ ఓం ప్రకాష్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులు సంజీవ్‌కుమార్ లాల్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈవీఎంల ర్యాండమైజేషన్ చేసినట్టు ఎన్నికల విభాగం పేర్కొంది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, రిటర్నింగ్ అధికారి సాయిరాం తదితరులూ ర్యాండమైజేషన్‌ను పరిశీలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు
Read Latest Telangana News and National News