Ganja Gang: గంజాయి బ్యాచ్ ఆగడాలు.. పోలీసుల వింత సమాధానాలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 10:52 AM
అడ్డు వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతూ గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వింత సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి, నవంబర్ 5: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబొడ కాలనీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పార్క్ చేసిన కార్ అద్దాలు ధ్వంసం చేసి హంగామా చేసింది. ఈ విషయమై ప్రశ్నించిన యజమానితో గంజాయి బ్యాచ్ దురుసుగా ప్రవర్తించింది. ‘నాకు పగలగొట్టాలని అనిపించింది అందుకే పగలగొట్టాను’ అంటూ దురుసుగా సమాధానం ఇచ్చిన ఆ బ్యాచ్.. అవసరమైతే కారు మొత్తం తగలబెడతాము అంటూ బెదిరింపులకు పాల్పడింది. అడ్డు వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతూ హల్‌చల్ చేసింది. దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలపై స్థానికులు పోలీసులకు ఫోన్ కాల్ చేసి సమాచారం ఇచ్చారు.
అయితే ఫిర్యాదు చేస్తేనే వస్తామని ఇన్స్‌పెక్టర్ క్యాస్ట్రో వింత సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసుల తీరుపై ఎర్రబొడ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు నమోదు కాకుండా లీడర్లు సముదాయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కాగా.. ఎర్రబొడలో బీరప్ప గుడి మెట్లపై కొందరు వ్యక్తులు మద్యం సేవించి బీర్ బాటిల్స్ అక్కడే పడేస్తున్న పరిస్థితి. ఈ విషయంపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదంటూ స్థానికులు ఆరోపించారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించింది. గంజాయి బ్యాచ్ వెకిలి సైగలతో మహిళలు ఆవేదనకు గురైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా గంజాయి బ్యాచ్ చేసిన ఆగడాలపై సమాచారం అందించినా కూడా ఇప్పటికీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో స్థానికులు ఫైర్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి...
అమెరికాలో ఘోర ప్రమాదం.. పేలిన కార్గో విమానం
మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన.. ప్రముఖ సంస్థల ఛైర్మన్లతో
Read Latest Telangana News And Telugu News